యాప్నగరం

మగాళ్లకూ న్యాయం చేయండి.. జాతీయ పురుష కమిషన్ కావాలి: బీజేపీ ఎంపీ

జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే.. జాతీయ పురుష కమిషన్ ఉండాలంటున్నారు బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్. భార్యల చేతుల్లో నలిగిపోతున్న బాధితులంతా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఓ వేదిక కావాలంటున్నారు.

Samayam Telugu 3 Sep 2018, 6:55 pm
ఆడవాళ్లకేనా మగవాళ్లకూ కష్టాలు ఉంటాయంటున్నారు బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్. భార్యల చేతుల్లో నలిగిపోతున్న బాధితులంతా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఓ వేదిక కావాలంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే.. జాతీయ పురుష కమిషన్ ఉండాలంటున్నారు. మీడియాతో మాట్లాడిన హరినారాయణ్ రాజ్‌భర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురష కమిష్ ఏర్పాటుకు ఉన్న ఆవశ్యకతను చెప్పుకొచ్చారు.
Samayam Telugu Rajbhar.


మన సమాజంలో భార్యల చేతుల్లో బాధితులుగా మారుతున్న భర్తలు చాలామంది ఉన్నారంటున్నారు రాజ్‌భర్. మహిళలకు న్యాయం చేసేందుకు జాతీయ కమిషన్ ఉన్నట్లే.. పురుషులకు కూడా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎవరికీ అన్యాయం జరగకూడదనేది తన అభిప్రాయమన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించానని.. అప్పటి నుంచి తన డిమాండ్‌కు మద్దతు పెరుగుతోందన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5వేలమంది తనకు మెసేజ్‌లు పంపారని.. విదేశాల నుంచి ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు.

హరినారాయణ్ రాజ్‌భర్ ఉత్తరప్రదేశ్‌లోని ఘోషి నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన చాలా రోజులుగా భార్యా బాధితులు, పురుషుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఈ అంశాన్ని ప్రస్తావించి హాట్‌టాపిక్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు పురుషకు జాతీయ కమిషన్ అంటూ తెరపైకి వచ్చారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.