యాప్నగరం

కమల్ ఓ ఇడియట్: బీజేపీ నేత!

ఆయనకు స్వపక్షం, విపక్షం అనే తేడాలేదు. తన దృష్టిలో ఎవరైనా ఒకటే. తన నోటికి పనిచెప్పి, తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత ఈసారి కమల్‌ను టార్గెట్ చేశారు.

TNN 10 Sep 2017, 6:29 pm
ఆయనకు స్వపక్షం, విపక్షం అనే తేడాలేదు. తన దృష్టిలో ఎవరైనా ఒకటే. తన నోటికి పనిచెప్పి, తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత ఈసారి కమల్‌ను టార్గెట్ చేశారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన నటుడు కమలహాసన్‌పై సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇతరుల కంటే తాను ఎంతో గొప్ప వ్యక్తిని అని భావించుకునే ఇడియట్ కమలహాసన్ సీపీఎంలో చేరుతున్నట్టు విన్నాను!’ అంటూ ట్విట్టర్‌లో స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీనిపై కమల్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
Samayam Telugu bjp senior leader subramanya swamy comments against kamal hassan
కమల్ ఓ ఇడియట్: బీజేపీ నేత!


I hear pompous idiot Kamalahasan is joining CPM! — Subramanian Swamy (@Swamy39) September 10, 2017 ‘ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన చాలామంది ఇడియట్స్ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారు. అందరూ సమర్థతగల ఇడియట్స్’, ‘స్టాలిన్ ను బహిరంగంగా ఆరాధించడం కమల్ ఇప్పుడే మొదలుపెట్టాడు!’,‘ ఆయన ఇష్టం ఏ పార్టీలో అయినా సరే చేరవచ్చు. మీరెందుకు బాధపడుతున్నారు బ్రోకర్ స్వామి?’, ‘కమలహాసన్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదు’ అంటూ రకరకాలుగా మండిపడ్డారు. మరి దీనికి స్వామి ఎలా స్పందిస్తారో మరి. ఇటీవల ఓ అభిమాని వివాహానికి హాజరైన కమల్‌హసన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు కేరళ సీఎం విజయన్‌ను కూడా ఆయన కలిశారు. అలాగే సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కూడా కమల్‌‌తో భేటీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.