యాప్నగరం

అభివృద్ది మాత్రమే కాదు, హిందూత్వపై దృష్టి

ఎన్నికల్లో గెలవాలంటే కేవలం దేశాభివృద్ధి అనే మంత్రం ఒక్కటే సరిపోదని, అందుకు బీజేపీ సిద్ధాంతమైన హిందూత్వపై దృష్టి సారించాల్సిన

Samayam Telugu 18 Dec 2016, 1:15 pm
ఎన్నికల్లో గెలవాలంటే కేవలం దేశాభివృద్ధి అనే మంత్రం ఒక్కటే సరిపోదని, అందుకు బీజేపీ సిద్ధాంతమైన హిందూత్వపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆపార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధానమంత్రి మోదీకి సూచించారు.
Samayam Telugu bjp should focus on hindutva says mp subramanian swamy
అభివృద్ది మాత్రమే కాదు, హిందూత్వపై దృష్టి


శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ రాసిన స్వచ్ఛయ్ (Sachchai) అనే పుస్తకాన్ని ముంబైలోని రుయా కాలేజీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి పాల్గొని మాట్లాడారు.

‘ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు తరచూ చెబుతుంటారు కానీ చరిత్ర మరోలా బోధిస్తోంది. కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించిన ఏ ప్రభుత్వం ఇండియాలో గెలవలేదని చరిత్ర నిరూపిస్తోంది. పీవీ నర్సింహారావు, రాజీవ్ గాంధీ, మోరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయ్..చంద్రబాబు నాయుడు...ఇలా ఎవరైనా కానీ వారివారి శక్తిమేరకు సంస్కరణలు చేపట్టారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అందుకే అభివృద్ధి అవసరమేకానీ అదే సర్వస్వం కాదు’ అని స్వామి అన్నారు.

2014లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడానికి రెండే రెండు కారణాలున్నాయని చెప్పిన స్వామి... గుజరాత్ మోడల్ ను ప్రజలు ఆశించడం...కులాలను పక్కనబెట్టి...హిందూత్వకు ఓటేయడమేనని అభిప్రాయపడ్డారు. హిందూవులున్న దేశంలో హిందూత్వ పరిరక్షణ దృష్టి సారించాలని ఆయన మోదీకి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.