యాప్నగరం

గుజరాత్ బీజేపీకి తగలని ‘నోట్ల’ దెబ్బ

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు.

TNN 29 Nov 2016, 6:55 pm
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రెండు మున్సిపాలిటీలు, ఒక తాలూక పంచాయతీ ఎన్నికలతో పాటు 11 మున్సిపాలిటీలు, ఏడు జిల్లా పరిషత్‌లు, 15 తాలూక పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Samayam Telugu bjp sweeps local body elections in gujarat
గుజరాత్ బీజేపీకి తగలని ‘నోట్ల’ దెబ్బ


వల్సాద్ జిల్లాలోని వాది మున్సిపాలిటీ ఎన్నికల్లో 44 సీట్లకు గాను బీజేపీ 41 సీట్లు గెలుచుకుంది. అలాగే సూరత్‌లోని కనక్‌పూర్-కన్సాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 28 సీట్లకు గాను 27 సీట్లు సొంతం చేసుకుంది. గోండల్ తాలూక పంచాయతీలో 22 సీట్లకు గాను 18 గెలుచుకుంది. జిల్లా పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. మొత్తం ఏడు జిల్లా పరిషత్‌లకు గాను బీజేపీ ఐదింటిలో విజయం సాధించింది.

అలాగే 15 తాలూకా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఐదు గెలుచుకోగా, కాంగ్రెస్ నాలుగింట విజయం సాధించింది. సాంకేతిక కారణాల వల్ల మిగిలిన సీట్ల ఫలితాలను వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా, గుజరాత్ స్థానిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ శ్రేణులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి విజయ్ రూపాని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీతు వాఘానిని మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Congratulations to @BJP4Gujarat Karyakartas, CM @vijayrupanibjp & @jitu_vaghani for their hardwork work across the state. — Narendra Modi (@narendramodi) November 29, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.