యాప్నగరం

మణిపూర్ లో కమలం జెండా!

బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై.. నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్ ను తమ నేతగా ఎన్నుకున్నారు.

TNN 13 Mar 2017, 7:22 pm
​మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను సాధించిన పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేగంగా దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు గల ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 21 సీట్లను మాత్రమే సాధించింది. కాంగ్రెస్ పార్టీ 28 సీట్లలో విజయం సాధించింది. కనీసం 31 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
Samayam Telugu bjp to from govt in manipur
మణిపూర్ లో కమలం జెండా!


మరో ముగ్గురు ఎమ్మెల్యేల బలాన్ని సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన చోట బీజేపీ చక్రం తిప్పింది. స్వతంత్రుల, చిన్న పార్టీల మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై.. నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్ ను తమ నేతగా ఎన్నుకున్నారు. అధిష్టానం ఆమోద ముద్రతో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు బలం ఉందని, గవర్నర్ ను కలిసి.. ఎమ్మెల్యేల వివరాలను ఇస్తామని సింగ్ ప్రకటించారు. దీంతో మణిపూర్ బీజేపీ నేతల, కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలనందుకుంది. తాము గెలిచిన చోట విజయాన్ని బీజేపీ దొంగతనం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ట్విటర్ ద్వారా బీజేపీ పై విమర్శల వాన కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.