యాప్నగరం

మణిపూర్ సీఎంగా బీరెన్ ప్రమాణస్వీకారం

మణిపూర్ లో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.

TNN 15 Mar 2017, 2:59 pm
మణిపూర్ లో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్పీపీ నేత వై.జాయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా... అందులో 28 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21 స్థానాలు గెలుచుకుంది. అయితే మిగతా స్థానాలు గెలిచిన చిన్నపార్టీలు తమ మద్దతును బీజేపీకి ఇచ్చాయి. దీంతో బీజేపీ బలం 32 అయ్యింది. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా బీజేపీని ఆహ్వానించారు.
Samayam Telugu bjps n biren singh sworn in as chief minister of manipur
మణిపూర్ సీఎంగా బీరెన్ ప్రమాణస్వీకారం


అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో పంజాబ్‌లో తప్ప మిగతా రాష్ట్రాలైన గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. గోవా, మణిపూర్ సీఎంలు ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారో బీజేపీ అధిష్ఠానం తేల్చాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.