యాప్నగరం

బీఎంసీ ఎన్నికలు: మొదలైన కౌంటింగ్

ఈ నెల 21న జరిగిన బృహాన్‌ముంబై మునిసిపల్ కార్పోరేషన్(బీఎంసీ) ఎన్నికలకి నేటి ఉదయం 10 గంటలకి కౌంటింగ్

TNN 23 Feb 2017, 10:59 am
ఈ నెల 21న జరిగిన బృహాన్‌ముంబై మునిసిపల్ కార్పోరేషన్(బీఎంసీ) ఎన్నికలకి నేటి ఉదయం 10 గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని మరో 9 నగరపాలిక సంస్థలకి అదే రోజు జరిగిన ఎన్నికలకి కౌంటింగ్ కూడా నేడే జరుగుతున్నప్పటికీ... ఆ రాష్ట్ర రాజధాని అయిన బీఎంసీ ఎన్నికల ఫలితంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది. అందుకు కారణం ముంబై కేవలం దేశ వాణిజ్య రాజధాని అవడం మాత్రమే ఓ కారణం అని కాదు.. శివసేన, బీజేపీలు విడిపోయిన తర్వాత ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తంచేస్తూ ఒంటరిగా పోటీ చేస్తున్న ఎన్నికలు కూడా ఇవే కావడం అందుకు మరో కారణం.
Samayam Telugu bmc election results 2017 counting underway
బీఎంసీ ఎన్నికలు: మొదలైన కౌంటింగ్


మొత్తం 227 స్థానాలకి జరిగిన ఈ ఎన్నికల్లో శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు హోరాహోరీగా తలబడుతున్నాయి. ఇక్కడ చాలా స్థానాల్లో శివసేన, బీజేపీలు హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగాయి. ఉదయం 11 గంటల సమయానికి శివసేన 13 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో వున్నాయి. అంతిమంగా ఆసియాలోనే అతి పెద్ద, సంపన్నమైన మునిసిపల్ కార్పొరేషన్‌లలో ఒకటిగా గుర్తింపున్న బీఎంసీ మేయర్ పీఠం ఎవరికి దక్కనుంది అనేది ఇవాళ తేలిపోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.