యాప్నగరం

శ్మశానం ఫీజు పెంపు.. పేదవాడి శవానికి కూడా ‘అవమానం’!

ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆ నలుగురు కూడా కరువయ్యారు. సూరత్‌లో జరిగిన ఈ ఘటనలో ఆ నలుగురు దొరికినా.. శ్మశానంలో సిబ్బంది కనికరించలేదు.

Samayam Telugu 26 Aug 2020, 7:22 pm
రోనా కష్ట కాలంలో దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ నలుగురు కూడా రాని విషాద ఘట్టాలను అనేకం చూస్తున్నాం. కానీ, దేవుడు కరుణించినా.. పూజారి కనికరించలేదన్న చందంగా గుజరాత్‌లోని సూరత్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అకాల మరణం చెందిన వ్యక్తికి అంత్యక్రియలు జరిపించడానికి శ్మశానానికి తీసుకెళ్లగా.. అక్కడ ఛార్జీలు పెంచినట్లు నిర్వాహకులు చెప్పారు. పెంచిన మొత్తం చెల్లించలేక ఆ నిరుపేదలు శ్మశానం బయట రోడ్డు పక్కనే ఆ మృతదేహాన్ని దహనం చేసి వెళ్లిపోయారు.
Samayam Telugu సూరత్ వ్యక్తి అంత్యక్రియలు (ప్రతీకాత్మక చిత్రం)
Body cremated on roadside as crematorium hikes fees in Surat


సూరత్ సమీపంలోని మారుమూల గిరిజన గ్రామం ‘ఎనా’లో కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే 45 ఏళ్ల ఓ వ్యక్తి అకాల మరణం చెందాడు. అతడి బంధువులు కొందరు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి స్థానిక శ్మశానానికి తీసుకొచ్చారు. కానీ, అక్కడి సిబ్బంది వారిని రూ.2500 చెల్లించాల్సిందిగా చెప్పారు. ఇటీవలే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఆ మొత్తం చెల్లిస్తే గానీ.. శ్మశానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

తమ వద్ద అంత మొత్తం లేదంటూ ఎంతగా బతిమాలినా వారి మనసు కరగలేదు. నిబంధనలు అలా ఉన్నాయని.. తాము ఏం చేయలేమని చెప్పారు. దీంతో చేసేదేంలేక మృతుడి బంధువులు ఆ మృతదేహాన్ని అక్కడే రహదారి పక్కన ఉంచి దహనం చేశారు. బతికినన్ని రోజులు ఎలా బతికాడో గానీ.. ఇన్నాళ్లూ పేదరికం వెక్కిరించింది. చివరికి చనిపోయిన తర్వాత ఆ పేదవాడి శవానికి కూడా అవమానమే మిగిలింది.

74 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో.. సాక్షాత్తూ దేశ ప్రధానికి చెందిన రాష్ట్రంలోని ఓ గ్రామంలో మనిషి చనిపోతే శ్మశానంలో దహన కార్యక్రమాలు నిర్వహించుకోలేని దుస్థితి మానవతావాదులకు ఆవేదన కలిగిస్తోంది.

Don't Miss: లక్కీ గాళ్.. క్లాసులు వింటూనే రూ.25 కోట్లు దక్కించుకుంది

Also Read: మృత్యుంజయుడు ఈ బాలుడు.. భవనం శిథిలాల కింద నుంచి 19 గంటల తర్వాత బయటకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.