యాప్నగరం

పావురాలను వదిలేశాడని రెండేళ్ల బాలుడి హత్య

అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నోడు.. పంజరంలో ఉన్న పావురాలను విడిపించాడు. అవి స్వేచ్ఛగా ఎగురుతుంటే వాటిని చూసి ఎంతో ఆనందించాడు.

TNN 9 Feb 2018, 1:28 pm
అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నోడు.. పంజరంలో ఉన్న పావురాలను విడిపించాడు. అవి స్వేచ్ఛగా ఎగురుతుంటే వాటిని చూసి ఎంతో ఆనందించాడు. కానీ ఆ చిన్నారి చేసిన పని 14 ఏళ్ల బాలుడికి ఆగ్రహం తెప్పించింది. నా పావురాలను ఎందుకు వదిలేశావని క్షణికావేశంలో ఆ పిల్లాడిని కొట్టి చంపేశాడు. ఈ ఘటన బెంగళూరులోని సోలదేవనహళ్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి పంపారు. పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu boy kills 2 year old for setting free his pigeons
పావురాలను వదిలేశాడని రెండేళ్ల బాలుడి హత్య


రాయచూర్‌కు చెందిన బసవరాజ్, వెంకమ్మ దంపతులు సోలదేవనహళ్లిలో నివాసముంటున్నారు. స్థానికంగా తోపుడు బండిపై కూరగాయలు, పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి పొరుగింటిలో ఉండే టీ వ్యాపారితో ఎప్పుడూ గొడవలే. బసవరాజ్ కుమారుల అల్లరితో వీరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న టీ వ్యాపారి కొడుకు వారం రోజుల క్రితం మూడు పావురాలను కొనుగోలు చేశాడు. ఒక్కోటి రూ.100 చొప్పున కొని వాటిని ఒక పంజరంలో ఉంచాడు.

బుధవారం ఉదయం 10.30 సమయంలో బసవరాజ్ ముగ్గురు కుమారులు ఆ పంజరాన్ని తెరిచి పావురాలను వదిలేశారు. మధ్యాహ్నం స్కూల్ నుంచి తిరుగొచ్చిన నిందితుడు పంజరంలో పావురాలు లేకపోవడం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన పావురాలు ఏమయ్యాయంటూ బసవరాజ్ ఇంటికి వెళ్లి ఆయన పిల్లలపై అరిచాడు. దీంతో బయటికి వచ్చిన బసవరాజు చిన్న కొడుకు వెంకటేష్ (2) తడబడుతూ వివరణ ఇచ్చాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన నిందితుడు వెంకటేష్‌ను కింద పడేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. దీంతో వెంకటేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే వెంకటేష్‌ను అతని తల్లి దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాబు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.