యాప్నగరం

వితంతువులతో ‘బ్రజగంధ’ సుగంధ తయారీ

మధురాలోని బృందావన్ ఆశ్రమంలోని వితంతు మహిళలు దేశంలోని పలు ప్రధాన ఆలయాలకు కోసం ప్రత్యేక సుగంధాన్ని తయారు చేస్తున్నారు. ఈ సుంగంధానికి ‘బ్రజగంధ’ అని పేరు పెట్టారు.

Samayam Telugu 7 Mar 2018, 5:22 pm
ధురాలోని బృందావన్ ఆశ్రమంలోని వితంతు మహిళలు దేశంలోని పలు ప్రధాన ఆలయాలకు కోసం ప్రత్యేక సుగంధాన్ని తయారు చేస్తున్నారు. ఈ సుంగంధానికి ‘బ్రజగంధ’ అని పేరు పెట్టారు. గురువారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ లోక్భవన్లో దీనికి పెటెంట్ హక్కులు కల్పించనున్నారు.
Samayam Telugu brajgandha will make widows from flora
వితంతువులతో ‘బ్రజగంధ’ సుగంధ తయారీ


ఈ ప్రాజెక్టుకు అవసరమైన మెషిన్లు, బాటిలింగ్, ట్రైనింగ్ కోసం ప్రభుత్వం రూ.1.67 కోట్లు వెచ్చింది. ఈ స్కీమ్ కోసం ఆశ్రమం వివిధ ఆలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. బృందావనంలో మహిళా సంక్షేమ శాఖ ఆధర్యంలో 5 ఆశ్రమాల్లో సుమారు 500 మంది మహిళలు పనిచేస్తున్నారు. సుగంధాల తయారీకి కావల్సిన పూలను మహిళా సంక్షేమ శాఖే సమకూర్చుతోంది.
To read this story in Hindi.. Click here
సుంగంధాల తయారీ కోసం స్వయం సేవా బృందానికి చెందిన మహిళా ప్రణాళిక విభాగం కొద్ది నెలల ముందు వితంతు మహిళలకు కన్నౌజులోని ఫ్రాగ్రెన్స్ అంట్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ (FFDC)లోశిక్షణ ఇప్పించారు. ఈ సుంగంధాలను విక్రయించగా వచ్చే మొత్తంలో 80 శాతం మహిళా సంక్షేమం, 20 శాతం ఆలయాలకు ఇవ్వాలని నిర్ణయించారు.

వారణాసి, మిర్జాపూర్ ఆలయాల్లో వినియోగించే పూలను సైతం సుగంధ తయారీకి వినియోగించాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వితంతువులు పూల నుంచి తయారు చేసిన 100 కిలోల గులాల్ను ప్రధాని నరేంద్ర మోది, ఉత్తరప్రదేశ్ మంత్రులకు బహుమతిగా ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.