యాప్నగరం

దినకరన్ కేసు: హవాలా ఆపరేటర్ అరెస్ట్

ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తు రెండాకులు దక్కించుకునేందుకు అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ ప్రధాన

TNN 28 Apr 2017, 2:03 pm
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తు రెండాకులు దక్కించుకునేందుకు అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఎన్నికల సంఘానికి రూ.50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడన్న కేసులో మరో హవాల ఆపరేటర్ నరేష్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
Samayam Telugu bribe for symbol hawala operator arrested in dinakaran case
దినకరన్ కేసు: హవాలా ఆపరేటర్ అరెస్ట్


ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు హవాలా ఆపరేటర్లు అరెస్టయ్యారు. శుక్రవారం ఉదయం నరేష్ ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రంజన్ తెలిపారు.

దినకరన్ కు మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ చంద్రశేఖర్ నేరేష్ వివిధ మార్గాల ద్వారా డబ్బులు చేరవేసుందుకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎన్నికల గుర్తును దక్కించుకునేందుకు ఈసీనే కొనుగోలు చేసు ప్రయత్నం చేసి కేసులో తొలుత సుకేష్ అరెస్టు కాగా, తర్వాత దినకరన్ ఆయన స్నేహితుడు మల్లికార్జున్, మరో ఇద్దరు హవాలా ఆపరేటర్లు అరెస్టయ్యారు. శుక్రవారం మూడో హవాలా ఆపరేటర్ అరెస్టయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.