యాప్నగరం

ఫోటోషూట్‌ సల్లగుండ.. వధువు కిందపడిపోయింది!

Bride falls off in Photoshoot: లెహెంగా ధరించిన వధువు ఫోటోషూట్ కోసం పరుగెత్తుతూ కింద పడిపోయిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బరువైన లెహెంగా ధరించడమే అందుక్కారణం కావొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. కిందపడిపోయిన తర్వాత వధువు నవ్వులు చిందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి వరుడు కూడా పడిపోయుంటాడు అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఫోటోషూట్, రీల్స్ కోసం వధూవరులు చేసే ఫీట్లు కొన్నిసార్లు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 31 Dec 2022, 6:56 pm
ఫోటోషూట్, రీల్స్ కోసం వధూవరులు చేసే ఫీట్లు కొన్నిసార్లు అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి ఫోటోషూట్‌ చేస్తుండగా ఓ వధువు కిందపడిపోయింది. బరువైన లెహెంగా వేసుకొని ఫోటోషూట్ స్టిల్స్‌లో భాగంగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి గానీ.. కిందపడినా, ఆత్మవిశ్వాసంతో ఆమె నవ్వులు చిందించిన తీరు వీడియోను అందంగా మార్చింది. ‘ఆ దృశ్యం చూసి వరుడు పడిపోయి ఉంటాడు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Samayam Telugu Bride falls off during Photoshoot
లెహెంగాలో వధువు ఫోటోషూట్


‘మేరా దిల్ యే పుకారే ఆజా’ అనే పాపులర్ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, హాలులో వధువు పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వధువు వెనుక కెమెరామ్యాన్, లైట్‌మ్యాన్ పరిగెత్తుతారు. ఆమె తన లెహంగాను చూపించడానికి ముందుకు తిరుగుతుంది. ఈ ప్రయత్నంలో కిందపడిపోతుంది.

పెళ్లికూతురును పైకి లేపేందుకు లైట్ మ్యాన్ సాయం చేశాడు. బరువైన లెహెంగాతో పైకి లేచేందుకు ఇబ్బంది పడుతూ ఆమె పెద్దగా నవ్వింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

View this post on Instagram A post shared by couple 👫ŁØvÊ 💖status 🔥💫 (@x._.love.07)

‘అందమైన లెహంగా. మీరు నేలపై ఉన్నప్పుడు అది మరింత అందంగా ఉంది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘అంత పెద్ద లెహంగా ధరించి ఫోటోషూట్ చేయాల్సిన అవసరం లేదు’ అని మరొక యూజర్ కామెంట్ పెట్టారు. ‘వరుడు కూడా పడిపోయి ఉంటాడు’ అని మరొక యూజర్ చమత్కరించాడు.

తాగుడుకు బానిసైన వారికి పిల్లనివ్వకండి.. కోడలి గురించి చెబుతూ కేంద్ర మంత్రి
వాట్సాప్ లింక్ క్లిక్ చేసి.. 9 లక్షలు పోగొట్టుకున్న బ్యాంక్ ఉద్యోగిని
Also Read: Hyd: బాత్రూం మురుగుతో బడుగుజీవి సావాసం.. బిల్లు కట్టలేదని సీవరేజ్ కట్, 25 రోజులుగా నరకం
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.