యాప్నగరం

హైదరాబాద్, చెన్నైలకు విమానాలు రద్దు చేసిన బ్రిటన్

ఈ రోజు లండన్ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమాన సర్వీసులను బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా రద్దు చేసింది.

TNN 28 May 2017, 10:19 am
ఈ రోజు లండన్ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమాన సర్వీసులను బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా రద్దు చేసింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెత్రో, గట్విక్ విమానాశ్రయాల నుంచి సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలను రద్దయ్యాయి. అయితే ఢిల్లీ, ముంబైల విమానాలకు మాత్రం ఆటంకం లేదని తెలిపింది. ఈ విమానాలు ఆదివారం ఉదయం అనుకున్న ప్రకారమే బయలుదేరుతాయని బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికారులు ప్రకటించారు. హెత్రో, గట్విక్ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలను రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డొమెస్టిక్, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.
Samayam Telugu british airways cancels all flights from gatwick and heathrow due to it failure
హైదరాబాద్, చెన్నైలకు విమానాలు రద్దు చేసిన బ్రిటన్


శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత దీనిపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికారికంగా ప్రకటన వెలువరించింది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించి, సర్వీసులను పునురుద్ధరిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ రెండు విమానాశ్రయాల నుంచి సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణీకులు ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇండియా నుంచి లండన్‌కు వెళ్లే అంతర్జాతీయ సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిర్ణీత సమయం ప్రకారం ఇవి బయలుదేరుతాయని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.