యాప్నగరం

బెంగళూరులో బ్రిటిష్ పీఎం‌కు ఘనస్వాగతం

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే భారత పర్యటనలో భాగంగా మంగళవారం బెంగళూరు చేరుకున్నారు.

TNN 8 Nov 2016, 3:18 pm
బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే భారత పర్యటనలో భాగంగా మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థెరిసాకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రలు ఘన స్వాగతం పలికారు. నగరంలో తొలిసారి పర్యటిస్తున్న బ్రిటీష్ పీఎం ఈ రోజంతా బిజీబిజీగా గడపనున్నారు.
Samayam Telugu british pm welcomed by cm siddaramaiah at bengaluru airport
బెంగళూరులో బ్రిటిష్ పీఎం‌కు ఘనస్వాగతం


దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, థెరిసా మే సమావేశం కానున్నారు. తక్కువ వ్యయానికే యూకే వీసాలను అందించాల్సిందిగా థెరిసా మేను సిద్ధరామయ్య కోరనున్నట్లు సమాచారం. బ్రిటన్ కొత్త వీసా నిబంధనల ప్రభావం తమ రాష్ట్రంపై పడే అవకాశముందని భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి. దేశ్‌పాండే వెల్లడించారు. బెంగళూరు నుంచి చాలా మంది టెకీలు, పర్యాటకులు, విద్యార్థులు తరచుగా యూకే వెళ్తుంటారని, ఈ కొత్త వీసా నిబంధనలు వీరి ప్రయాణాన్ని కఠినతరం చేస్తాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి బ్రిటిష్ ప్రధానితో చర్చిస్తారని చెప్పారు.

కాగా, నగర పర్యటనలో భాగంగా నేడు థెరిసా యెలహంకలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. ఆ తరవాత డైనమిక్స్ టెక్నాలజీ సంస్థను, సోమేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.