యాప్నగరం

భారత్-పాక్ సరిహద్దుల్లో సొరంగం, ఆయుధాల డంప్

భారత్-పాక్ సరిహద్దుల్లో వెలుగుచూసిన సొరంగం

TNN 30 Sep 2017, 8:57 pm
భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో భారీ సొరంగం వెలుగుచూసింది. జమ్ము కాశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌‌లో డామన వద్ద విక్రమ్, పటేల్ పోస్టుల మధ్య ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి తవ్విన 14 అడుగుల సొరంగాన్ని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)దళాలు గుర్తించాయి. పాక్ నుంచి ఈ సొరంగం ద్వారా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారని అక్కడి పరిస్థితినిబట్టి చూస్తే అర్థమవుతోందని బీఎస్ఎఫ్ ప్రకటించింది. సొరంగం తవ్విన మార్గంలో భారీగా పాక్‌లో తయారు చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Samayam Telugu bsf has unearthed a 14 foot long tunnel from pakistani side
భారత్-పాక్ సరిహద్దుల్లో సొరంగం, ఆయుధాల డంప్


ఇటీవల క్రాస్ బార్డర్ షెల్లింగ్ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రహస్య మార్గాలు, సొరంగాలు గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.