యాప్నగరం

పాకిస్థాన్ పడవను సీజ్ చేసిన బీఎస్ఎఫ్

భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక పడవను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించి సీజ్ చేసింది.

TNN 4 Oct 2016, 2:27 pm
భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక పడవను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించి సీజ్ చేసింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో రావి నదిలో నిలిపి ఉంచిన పడవను మంగళవారం ఉదయం ఓ బీఎస్ఎఫ్ జవాను గుర్తించారు. వెంటనే స్పీడ్ బోట్‌లో ఆ పడవ దగ్గరకు చేరుకుని దాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్.ఎస్. కటారియా వివరాలను మీడియాకు వెల్లడించారు. గుర్తుతెలియన వ్యక్తులు ఆ పడవను ఒక చెక్క కొక్కానికి తాడుతో కట్టి ఉంచారని ఆయన వివరించారు. అయితే ఆ పడవలో ఎలాంటి వస్తువులు దొరకలేదని చెప్పారు. పాకిస్థాన్‌కు సంబంధించిన గర్తులు ఆ పడవపై ఉన్నాయని తెలిపారు.
Samayam Telugu bsf seizes pakistani boat in gurdaspur
పాకిస్థాన్ పడవను సీజ్ చేసిన బీఎస్ఎఫ్


The Border Security Force (BSF) has seized a Pakistani boat from river Ravi in Gurdaspur on Tuesday morning. BSF's deputy inspector general RS Kataria said that a BSF jawan had spotted the boat near Tota bulge at around 4.45 am following which BSF's speed boat reached the spot and seized the boat with a wooden anchor and nylon rope.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.