యాప్నగరం

బడ్జెట్ సెషన్: పెండింగ్‌లో ముఖ్యమైన బిల్లులు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉభయసభల్లో ప్రారంభమయ్యాయి.

TNN 24 Feb 2016, 12:02 pm
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉభయసభల్లో ప్రారంభమయ్యాయి. సభలో జేఎన్ యూ ఘటన, రోహిత్ వేముల ఆత్మహత్యపై చర్చలు సాగుతున్నాయి. కాగా సభ ఆమోదించాల్సిన, ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. 12 బిల్లులు పాస్ (ఆమోదం) చేయాలి, 4 బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటూ సభ ఆమోదించాలి, రెండు కొత్త బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలి. రెండు చట్టాలను ఉపసంహరించేందుకు సభ ఆమోదించాలి. సభా సజావుగా సాగితే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయి. లేకుంటే పెండింగ్ లోనే ఉండిపోతాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా ఉన్నాయి. చిన్న రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలపాలి. అలాగే రాజ్యాంగంలో ఉన్న బినామీ లావాదేవీల అంశంలో సవరణ చేసి బ్లాక్ మనీ బిల్లును ఆమోదించాలి. లోక్ పాల్ బిల్లు, అవినీతినిరోధక బిల్లు 2013, రియల్ ఎస్టేట్ బిల్లు 2013, వక్ఫ్ ఆస్తుల బిల్లు 2014 మొదలగున్నవి ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.