యాప్నగరం

పొలం పనికి వద్దు కొమ్ములు దూస్తే చాలు

రంకెలేసే తమ ఎద్దుకు ముక్కుతాడు వేసే మగాడే లేని విధంగా ఎద్దులను బలిష్టంగా తయారు చేస్తారు యజమానులు. జల్లికట్టు బరిలోకి దిగిన వారిలో ఎంత మందిని చిత్తు చేస్తే ఎద్దు యజమానికి అంత గౌరవం.

TNN 15 Jan 2018, 7:31 pm
ముగ్గులు, రంగ వల్లులు, గొబ్బెమ్మలు, బోగి మంటలు, పొంగళ్లతో మన దగ్గర సంక్రాంతి సందడి ఉంటే తమిళనాడులో వీటికి తోడు వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు పెద్ద పీట వేయడం ఆనవాయితీ. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తూ, తమ పౌరుషాన్ని చాటుకునే క్రీడాకారులతో ఈ క్రీడ సాగుతుంది. అయితే ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎంతటి బలశాలి బరిలోకి దిగినా వారిని చిత్తు చేసే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
Samayam Telugu bulls from goshala ready to enter the jallikattu ring
పొలం పనికి వద్దు కొమ్ములు దూస్తే చాలు


రంకెలేసే తమ ఎద్దుకు ముక్కుతాడు వేసే మగాడే లేని విధంగా ఎద్దులను బలిష్టంగా తయారు చేస్తారు యజమానులు. జల్లికట్టు బరిలోకి దిగిన వారిలో ఎంత మందిని చిత్తు చేస్తే ఎద్దు యజమానికి అంత గౌరవం. ఏమాత్రం బెదరకుండా ఎంత మంది వచ్చినా చిత్తు చేసే విధంగా బుల్స్ ను తయారు చేసేందుకు యజమాని పడే కష్టం అంతా ఇంతా కాదు. దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఎద్దును పొలం పనులకు కూడా పంపకుండా జల్లికట్టు విద్యలో తర్పీదు ఇస్తారు. ఎద్దులో స్టామినా పెంచేందుకు వారానికి రెండు సార్లు చెరువులో ఎద్దుతో ఈత కొట్టిస్తారు. కండరాలు బలిష్టమయ్యేందుకు కచ్చారోడ్లపై రోజుకు ఐదు కిలోమీటర్లు నడిపించి అనంతరం ప్రత్యేక నూనెలతో మసాజులు చేస్తారు.

బరిలోకి దిగిన వారిని ఎత్తిపడేసే విధంగా ట్రేనింగ్ ఇచ్చేందుకు కొమ్ములతో పొడిమట్టిలో పొడిపిస్తారు. బలవర్థమైన ఆహారం ఇస్తారు. ఇందు కోసం రకరకాల పచ్చిగడ్డితో పాటు కందిపప్పు, పెసరపప్పుతో తయారు చేసిన కుడిది, గోధుమ పిండి పత్తి విత్తనాల పొడితో తయారు చేసిన కుడిదిని ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరిస్తే ఎద్దులకు ప్రతీ రోజు పెద్ద ఎత్తున కోడిగుడ్లు, కోడి మాంసం వండి వార్చేవాళ్లు కూడా ఉన్నారు. దీపావళి నుంచి సంక్రాంతి వరకు వాటి పనల్లా తినడం కొమ్ములు దుయ్యడమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.