యాప్నగరం

బర్గర్ కింగ్ ఇండియా బంపరాఫర్.. షేర్ కావాలా?

బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్టు కానుంది. షేర్ ధరను నిర్ణయించింది. కంపెనీ ప్రారంభ షేర్ ధరను రూ.59 - 60గా నిర్ణయించింది.

Samayam Telugu 3 Dec 2020, 1:52 am
బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ భారత్‌లో తొలి ఐదేళ్ల కార్యకలాపాల తర్వాత ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. క్యూఎస్ఆర్ చెయిన్‌లో భాగమైన Burger King India పబ్లిక్ ఇష్యూ బుధవారం (డిసెంబర్ 2) ప్రారంభమైంది. కంపెనీ షేర్ ధరను రూ.59 - 60గా నిర్ణయించింది. ఒక్కొక్కటి పది రూపాయల షేర్ వ్యాల్యూతో వీటిని జారీ చేస్తోంది.
Samayam Telugu బర్గర్
Burger


ఈ ఇష్యూ డిసెంబర్ 4న ముగియనుంది. దీని కోసం దరఖాస్తు చేసే వారు కనీసం 250 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని బర్గర్ కింగ్స్ ఇండియా సంస్థ తెలపింది. ఆ పైన కూడా అదే లెక్కన ఎన్ని షేర్లయినా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బర్గర్ కింగ్ షేర్లు డిసెంబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.