యాప్నగరం

Odisha Bus Accident: వంతెనపై నుంచి లోయలోపడ్డ బస్సు

మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Samayam Telugu 20 Nov 2018, 9:30 pm
ఒడిశాలోని కటక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జగత్‌పూర్‌ సమీపంలోని మహానది బ్రిడ్జి మీదకు రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎద్దును ఢీకొట్టి బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu Bus accident1


ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లను సైతం వంతెన వద్ద సిద్ధంగా ఉంచారు. బస్సు నుంచి బయటకు తీసిన వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
బస్సు ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సహాచక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.