యాప్నగరం

Maharashtra: త్వరలో మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. షిండే వర్గానికి గుడ్‌న్యూస్!

Maharashtra: మహారాష్ట్రలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. షిండే వర్గానికి చెందిన 8 మంది నేతలు మంత్రులయ్యే ఛాన్స్ ఉంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 19 May 2023, 2:20 pm

ప్రధానాంశాలు:

  • వచ్చేవారం మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
  • షిండే వర్గానికి చెందిన నేతలకు పదవులు
  • 8 మంది నేతలకు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Maharashtra Cabinet Expansion
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోంది. దాదాపు 9 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ (Cabinet expansion) జరగబోతోంది. 2022 ఆగస్టు 9న మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 18 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. వీరిలో 9 మంది బీజేపీ, 9 మంది ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన వారు ఉన్నారు.
జూన్ 30న సీఎంగా ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి.. చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, రాధాకృష్ణ విఖే పాటిల్, సురేష్ ఖాడే, అతుల్ సేవ్, రవీంద్ర చవాన్, మంగళ్ లోధా, విజయ్ కుమార్ గవిత్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
షిండే వర్గం నుంచి.. ఉదయ్ సమంత్, సందీపన్ బుమ్రే, దాదా భూసే, గులాబ్రావ్ పాటిల్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. తాజాగా జరగబోయే విస్తరణలో షిండే వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 8 మంది కొత్తగా మంత్రులు అవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.