యాప్నగరం

స్వర్ణ దేవాలయంలో కెనడా ప్రధాని సందడి

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బుధవారం (ఫిబ్రవరి 21) అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం ట్రూడో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ను కలిశారు.

TNN 21 Feb 2018, 11:58 pm
భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బుధవారం (ఫిబ్రవరి 21) అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చిన ట్రూడోకు అక్కడ సాదర స్వాగతం లభించింది. అనంతరం ట్రూడో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ను కలిశారు.
Samayam Telugu canadian pm justin trudeau visits golden temple with his family
స్వర్ణ దేవాలయంలో కెనడా ప్రధాని సందడి


ట్రూడో కుటుంబం ఇప్పటికే తాజ్‌మహల్, అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమం సందర్శించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లతో పాటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలను కలిశారు.

ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్‌ కలిపిన ట్రూడో ఆమెతో మాట్లాడుతూ.. కిందటిసారి ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కెనడా, భారత్‌ దేశాలు ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’గా అభివర్ణించినట్లు తెలిపారు. ఏటా భారత్‌ నుంచి 1.25 లక్షల మంది విద్యార్థులు కెనడాకు వస్తుంటారని మున్ముందు కెనడాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

కెనడా, భారత్‌ మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని తాను భారత్‌ వచ్చానని ట్రూడో స్పష్టం చేశారు. అంతేగానీ షేక్‌ హ్యాండ్‌లు, ఫొటోలకు పోజులివ్వడానికి కాదని తెలిపారు. వ్యాపారం, సాంస్క్రతిక కార్యక్రమాల ద్వారా కూడా భారత ప్రజలతో నేరుగా మాట్లాడవచ్చని దీని ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం మరింత బలపడుతుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.