యాప్నగరం

వీడియో: జలపాతంలో కొట్టుకుపోయిన శాస్త్రవేత్త

కర్నాటకలోని మైసూరులో విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ సెలవులను కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ శాస్త్రవేత్త.. జలపాతంలో కొట్టుకుపోయారు

Samayam Telugu 4 Jun 2018, 12:54 pm
ర్నాటకలోని మైసూరులో విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ సెలవులను కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ శాస్త్రవేత్త.. జలపాతంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన చుంచనకట్టె జలపాతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన్ను మైసూరులోని సీఎఫ్టీఆర్‌ఐలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న సోమశేఖర్‌గా గుర్తించారు.
Samayam Telugu a


సోమశేఖర్‌తో అతని కుటుంబ సభ్యులు ఆదివారం చుంచనకట్టె జలపాతానికి వెళ్లారు. జలపాతం పైన ఉన్న ప్రవాహంలోకి వెళ్లి ఫొటోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. దీంతో వారంతా జలపాతం మధ్యలో చిక్కుకున్నారు. స్థానికులు, పర్యాటకులు దుస్తులను తాళ్లుగా చేసి.. ముగ్గురిని రక్షించారు. సోమశేఖర్‌‌ను కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా.. అతను ఒక్కసారిగా అదుపుతప్పి జలపాతంలోకి జారిపోయారు.

జలపాతంలో గల్లంతైన సోమశేఖర్ కోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు. ఈ జలపాతం కావేరీ నదిలో ఉంది. దీనికి ఎగువన ఉన్న విద్యుత్తు యూనిట్‌కు నీటి సరఫరా నిలిపి, నదిలోకి వదలడంతో ఒక్కసారిగా జలపాతంలో నీటి ఉధృతి పెరిగినట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.