యాప్నగరం

ఉత్తరాఖండ్ సీఎంకు సీబీఐ సమన్లు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

TNN 23 Dec 2016, 2:55 pm
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీష్ రావత్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డబ్బు పంచుతున్న వీడియో, ఆడియో టేపులు బయటకొచ్చాయి. దీంతో ఏప్రిల్ 29న సీబీఐ ఆయనపై విచారణను ప్రారంభించింది. మే 9న కూడా సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో హరీష్ రావత్ జూన్ నెలలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే.
Samayam Telugu cbi summons uttarakhand cm harish rawat
ఉత్తరాఖండ్ సీఎంకు సీబీఐ సమన్లు


తొమ్మిది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మార్చి 27న కేంద్రం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. ఆ సమయంలోనే కేసును సీబీఐకి అప్పగించారు. సుప్రీం ఆదేశాలతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తేశాక.. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గిన ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.