యాప్నగరం

సిలబస్ 30% తగ్గింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

CBSE: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని సూచించింది. విద్యా సంవత్సరం నష్టపోయిన వేళ విద్యార్థులపై భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

Samayam Telugu 7 Jul 2020, 8:12 pm
రోనా మహమ్మారితో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై భారం తగ్గించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 30 శాతం సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని సీబీఎస్‌ఈకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్డీ) సూచించింది. లాక్‌డౌన్‌తో విద్యా సంవత్సరం కోల్పోయిన నష్టాన్ని ఈవిధంగా పూడ్చాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం (జులై 7) తెలిపారు.
Samayam Telugu సీబీఎస్‌ఈ సిలబస్ తగ్గింపు
CBSE Syllabus Cut Off


సిలబస్‌ను తగ్గించే అంశంపై కొన్ని వారాల కిందట విద్యా నిపుణుల నుంచి సలహాలు ఆహ్వానించినట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. దీనిపై 1500 సలహాలు వచ్చినట్లు వెల్లడించారు. సూచనలు ఇచ్చిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

అభ్యాస సాధన ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాన అంశాలను కొనసాగిస్తూనే.. సిలబస్‌ను 30 శాతం వరకు హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో, ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని చూసి పాఠ్యాంశాలను సవరించాలని సీబీఎస్ఈకి సూచించినట్లు వివరించారు.

9 కంటే తక్కువ తరగతులకు స్వేచ్ఛ..?
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ - 10, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌ను 25 శాతం తగ్గిస్తున్ననట్టుగా ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు.. ఎనిమిదో తరగతి, అంతకంటే తక్కువ తరగతులకు సీబీఎస్‌ఈ-అనుబంధ పాఠశాలలు సిలబస్‌ను సొంతంగా తగ్గించడానికి స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా మార్చి 16 నుంచి దేశంలో విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు తెరిపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పిల్లల ప్రాణాలను రిస్క్‌లో పెట్టే సాహసం చేయలేమని అధికారులు చెబతున్నారు. విద్యా సంస్థలపై ఆంక్షలు జులై 31 వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది.

Also Read: విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్

Must Read: గల్వాన్ ఘర్షణ: అమర జవాన్లకు సంబంధించి షాకింగ్ నిజాలు

Also Read: ట్రాన్స్‌జెండర్‌కు కరోనా.. ఆస్పత్రిలో ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లు, దేశంలో తొలిసారిగా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.