యాప్నగరం

ఎన్టీఆర్‌కు భారతరత్న.. స్పందించిన కేంద్రం..

మహానటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

TNN 21 Sep 2017, 8:35 am
మహానటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని ఇటీవల లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించింది కేంద్ర హోంశాఖ.
Samayam Telugu central government reacts on bharat ratna for ntr
ఎన్టీఆర్‌కు భారతరత్న.. స్పందించిన కేంద్రం..


ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం గురించి ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం ఈ విషయం ప్రధానమంత్రి పరిధిలో ఉందని కిరణ్ రిజుజు ప్రకటించారు. భారతరత్న పురస్కారాన్ని ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని ప్రధానమంత్రి నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దీంతో బంతి మోడీ కోర్టులో పడినట్టు అయ్యింది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కూడా అయినా ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ చాన్నాళ్ల నుంచినే డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ విషయంలో బహిరంగ డిమాండ్ చేస్తోంది. మరి ఈ పార్టీ విన్నపం పట్ల మోడీ ఎలా స్పందిస్తారో చూడాలిక.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.