యాప్నగరం

చెట్టెక్కి ఫోన్ మాట్లాడిన కేంద్రమంత్రి

కేంద్ర మంత్రికే కష్టమొచ్చింది. ఫోన్ మాట్లాదామంటే సిగ్నల్ అందలేదు...

TNN 5 Jun 2017, 2:48 pm
కేంద్ర మంత్రికే కష్టమొచ్చింది. ఫోన్ మాట్లాదామంటే సిగ్నల్ అందలేదు... దీంతో నిచ్చెన వేసుకుని చెట్టు ఎక్కాల్సి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన కేంద్ర సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్. ఆయన నియోజకవర్గం బికనీర్. ఆయన పర్యటనలో భాగంగా బికనీర్ లోని ఢోలియా అనే గ్రామానికి వచ్చారు. ఆ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, రోడ్లు అన్నీ సమస్యలే. అందుకోసమే ఆ సమస్యలేంటీ తెలుసుకుందామని స్వయానా మంత్రిగారే విచ్చేశారు. గ్రామస్థులంతా ఆయన చుట్టూ చేరి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఆ సమస్యల్లో ఒకటి నర్సుల కొరత. గ్రామ ఆసుపత్రిలో నర్సులు తగినంత మంది లేరని స్థానికులు చెప్పారు.
Samayam Telugu central minister climbed on tree to receive cellphone signal
చెట్టెక్కి ఫోన్ మాట్లాడిన కేంద్రమంత్రి


సమస్య అక్కడే పరిష్కరిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి అర్జున్ ఆరోగ్య శాఖ అధికారికి ఫోన్ చేద్దామని జేబులోంచి మొబైల్ తీశారు. తీరా చూస్తే ఒక్క సిగ్నల్ పాయింట్ కూడా లేదు. ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తుంటే... గ్రామస్థులు మరో సమస్య చెప్పారు. ఆ గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ అసలు ఉండవని, ఫోన్ చేయాలనుకుంటే... చెట్టెక్కాలని తెలిపారు. దగ్గర్లో ఎక్కడా సెల్ టవర్ లేకపోవడం వల్ల గ్రామానికి సిగ్నల్స్ అందవని చెప్పారు. దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్స్ కోసం నిచ్చెనేసి చెట్టెక్కి మాట్లాడుతామని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక కేంద్రమంత్రి గారు అదే పని చేశారు.

ఓ చెట్టుకు నిచ్చెనను ఆనించి మంత్రి కూడా పైకెక్కారు. అప్పుడు ఓ రెండు పాయింట్లు సిగ్నల్ రావడంతో సంబంధింత అధికారితో మాట్లాడారు. కొందరు ఆయన చెట్టెక్కిన వీడియోలు, ఫోటోలు ఆన్ లైన్ లో పెట్టారు. అవన్నీ వైరల్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.