యాప్నగరం

నీటి నిర్వహణకై హై లెవెల్ కమిటీ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

TNN 4 Oct 2017, 6:14 pm
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈశాన్య భారతంలోని నీటి వనరులని మరింత మెరుగ్గా నిర్వహంచే దిశగా ఈ కమిటీ పనిచేయనుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఆగస్టు నెలలో అస్సాంలో వరదలు భీభత్సం సృష్టించిన సందర్భంగా గౌహతిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
Samayam Telugu centre constitutes a high level committee for proper management of water resources in north eastern region
నీటి నిర్వహణకై హై లెవెల్ కమిటీ ఏర్పాటు


ఈశాన్య భారతంలోని నీటి వనరుల ఆధారంగా హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పత్తి, వ్యవసాయ అవసరాలు, బయో-డైవర్సిటీ కన్జర్వేషన్, అటవీ, మత్స్య సంపద, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టిసారించనుంది. ఈశాన్య భారత ప్రాంతాల అభివృద్ధి కోసం సంబంధింత శాఖ అధికార యంత్రాంగం సైతం ఈ కమిటీతో కలిసి పనిచేయనుంది.

2018 జూన్ నాటికి కమిటీ ఈ అంశాలపై అధ్యయనం పూర్తిచేసి సూచనలు, సలహాలతో కూడిన నివేదికను కేంద్రానికి అందజేయాల్సి వుంది. వరదల నేపథ్యంలో అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలోనే ఈశాన్య భారతంలోని నీటి వనరుల నిర్వహణ కోసం ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకిటించారు. అప్పటి ప్రకటనను అనుసరిస్తూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.