యాప్నగరం

భారత్‌లో కన్నా పాక్, బంగ్లాదేశ్‌లోనే పెట్రోలు ధర తక్కువ: సిద్ధూ

సిద్దూ: పెట్రోలు, డీజిల్‌ ధరలపై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Samayam Telugu 2 Oct 2018, 5:11 pm
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ స్పందించారు. దేశంలో ఇంధన ధరల ఆకాశాన్ని అంటుతున్నా.. వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. భారత్‌తో పోల్చితే సరిహద్దు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లోనే ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గత కొన్ని వారాలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పాయని సిద్దూ ఎద్దేవా చేశారు.
Samayam Telugu siddu


ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్న కేంద్రం మాత్రం ధరలను తగ్గించే ఆలోచన చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలపై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. క్రూడాయిల్‌కు పన్ను మినహాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.