యాప్నగరం

చచ్చిపోతున్నారు.. హెలికాప్టర్లు పంపండి: కేరళ ఎమ్మెల్యే భావోద్వేగం

తన నియోజకవర్గంలో దయనీయ పరిస్థితిని చూసి చలించిన ఓ ఎమ్మెల్యే టీవీలో లైవ్‌లో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Samayam Telugu 18 Aug 2018, 3:48 pm
న నియోజకవర్గంలో దయనీయ పరిస్థితిని చూసి చలించిన ఓ ఎమ్మెల్యే టీవీలో లైవ్‌లో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వరదల నేపథ్యంలో ఓ మలయాళం టీవీ చానెల్‌తో చెనగన్నూర్ ఎమ్మెల్యే సాజీ చెరియన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని వివరిస్తూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.
Samayam Telugu kerala_flood_1533883106_800x420


‘‘దయచేసి ప్రధాన మంత్రి మోడీని హెలికాప్టర్లు పంపమని అడగండి. హెలికాప్టర్లు పంపండి. ప్లీజ్ ప్లీజ్.. లేకపోతే 50వేల మంది చనిపోతారు. గత నాలుగు రోజుల నుంచి మేము నావికాదళం సాయం అడుగుతున్నాం. ఇప్పటి వరకు వారి సాయం అందలేదు. ఇక్కడ వరదలో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు కేవలం ఎయిర్ లిఫ్టింగ్ ఒకటే పరిష్కారం.. ప్లీజ్, ప్లీజ్’’ అంటూ బాధను వ్యక్తం చేశారు.

అయితే, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే నావిక దళాలు పది బోట్లను ఆ ప్రాంతానికి పంపాయి. ఆ విషయం ఆయనకు తెలియకపోవడంతో పై విధంగా స్పందించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సైతం అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అయితే, వరదలో కరెంట్ (నీటి అడుగు ప్రవాహం) తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలకు విఘాతం ఏర్పడింది. కేరళాలోని వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన మొత్తం 79 బోట్లు, 400 మత్స్యకారుల బోట్ల ద్వారా సహాయ చర్యలు చేపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.