యాప్నగరం

చెన్నై అపోలోకు బాంబు బెదిరింపు

అపోలో ఆసుపత్రికి గుర్తు తెలియని దుండగులు బెదిరింపు కాల్ చేశారు.

TNN 8 Dec 2016, 7:13 pm
జయలలిత మూడు నెలల పాటూ చికిత్స పొంది, అనంతరం కన్ను మూసింది చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే. ఆ అపోలో ఆసుపత్రికి గుర్తు తెలియని దుండగులు బెదిరింపు కాల్ చేశారు. ఆసుపత్రిలో బాంబు పెట్టామని చెప్పారు. దీంతో భయపడిన స్టాఫ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాండ్ స్క్వాడ్ తో సహా దిగారు. ఆసుపత్రిలోని ప్రతి భాగాన్ని తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. దీంతో అది ఫేక్ కాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు.
Samayam Telugu chennai apollo hospital received a bomb threat call
చెన్నై అపోలోకు బాంబు బెదిరింపు


జయలలిత సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత మరి బయటి లోకాన్ని చూడలేదు. డిసెంబర్ 5 రాత్రి ఆమె మరణించినట్టు అపోలో వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జయ ఆరోగ్య సమాచారం విషయంతో తీవ్ర గోప్యత పాటించడంతో... జయ అభిమానులెవరో కోపంతో ఆసుపత్రికి బెదిరింపు కాల్ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.