యాప్నగరం

ఫోటోలు: చెన్నైతీరం... చమురుమయం

చెన్నైలోని సముద్రతీరం చమురుతో నిండిపోయింది.

TNN 3 Feb 2017, 3:26 pm
చెన్నైలోని సముద్రతీరం చమురుతో నిండిపోయింది. అడుగేస్తే చాలు కాలికి చమురు తెట్టు పట్టేస్తోంది. మెరీనా బీచ్ తో సహా చెన్నైలోని ప్రముఖ బీచ్ లన్నీ ఇలాగే ఉన్నాయి. దాదాపు అయిదురోజులుగా బీచ్ లన్నీ ఇలా చమురుమయంగానే మారాయి. శనివారం రెండు ఓడలు ఢీ కొట్టు కోవడంతో అందులో ఉన్న టన్నుల కొద్దీ చమురు సముద్రంలో కలిసి ఒడ్డుకు తేలుకుంటూ వచ్చింది. ఆ చమురు వల్ల వేల జలచరాల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వందల కొద్దీ తాబేళ్లు మృతి చెందాయి. సిబ్బంది, మత్స్యకారులు, స్థానికుల సాయంతో శుభ్రం చేసే ప్రక్రియను అయిదురోజుల నుంచి చేస్తున్నారు. ఆధునిక యంత్రాల సాయంతో చమురును తోడుతున్నారు. చెన్నై తీరంలో చమురును తొలగించేందుకు జరుగుతున్న క్లినింగ్ ఆపరేషన్ కు సంబంధించిన ఫోటో మాలిక ఇది.
Samayam Telugu chennai oil spill photos of clening operation
ఫోటోలు: చెన్నైతీరం... చమురుమయం


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.