యాప్నగరం

కోమాలో ఉన్న విద్యార్థిని కదిలించిన టీచర్..!

కోమాలోకి వెళ్లిపోయిన విద్యార్థిలో ఒక మాటతో టీచర్ చలనం తెప్పించిన ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకుంది. ప్లస్‌ టూ

Samayam Telugu 20 Jul 2018, 8:36 am
కోమాలోకి వెళ్లిపోయిన విద్యార్థిలో ఒక మాటతో టీచర్ చలనం తెప్పించిన ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకుంది. ప్లస్‌ టూ చదువుతున్న అరుణ్ పాండియన్ (17) ఇటీవల పాఠశాల నుంచి ఇంటికి వెళ్తూ.. బస్టాండ్‌ వద్ద అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో.. తోటి విద్యార్థులు.. అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తంజావూరుకి తరలించారు.
Samayam Telugu 00


ఆసుపత్రిలో పాండియన్‌‌ని పరిశీలించిన వైద్యులు.. నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటోందని.. అతను కోమాలోకి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న టీచర్లు అతడ్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో పాండియన్ చెవి వద్దకు వెళ్లిన ఒక టీచర్.. ‘తంబీ కన్‌ ముళిచ్చిపార్.. యార్‌ వందిరిక్కోరం’ అని నెమ్మదిగా చెప్పాడు. దీంతో అప్పటి వరకు అచేతన స్థితిలో ఉన్న పాండియన్‌లో చలనం మొదలైంది. కనురెప్పలు నెమ్మదిగా తెరిచి.. మళ్లీ మూసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. వైద్యులు.. టీచర్‌ను మళ్లీ.. మళ్లీ మాట్లాడాల్సిందిగా.. సూచించడంతో. విద్యార్థితో నెమ్మదిగా మాట్లాడుతూ టీచర్ అతడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకి అతని శ్రమ ఫలించింది.. వైద్యానికి స్పందించిన పాండియన్ కొద్దిసేపటి తర్వాత కోలుకుని.. అందరితో సరదాగా మాట్లాడాడు. టీచర్‌తో ఉన్న అనుబంధం.. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిందని పాండియన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.