యాప్నగరం

ITBP: ఐదుగురు సహచరులను కాల్చి చంపి, కానిస్టేబుల్ ఆత్మహత్య.. సెలవు ఇవ్వకపోవడమే కారణం!

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాన్ తోటి సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఆ జవాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

Samayam Telugu 4 Dec 2019, 12:02 pm
ఛత్తీస్‌గఢ్‌లో ఇండో టిబెటన్ పోలీసుల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణ్‌పూర్ జిల్లాలోని కదేనార్ క్యాంపులో చోటు చేసుకుంది. ఓ వివాదం విషయమై ఐటీబీపీ కానిస్టేబుల్ ఆగ్రహానికి లోనై.. సహచరులపై కాల్పులకు దిగినట్టు సమాచారం. అనంతరం తాను కూడా కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఐటీబీపీ జవాన్లు చనిపోయిన విషయాన్ని నారాయణ్‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.
Samayam Telugu కాల్పులు


కాల్పులకు దిగిన జవాన్‌ను అడ్డుకోబోయిన మిగతా జవాన్లకు కూడా ఈ ఘటనలో గాయలైనట్టు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఐజీ ఏం చెప్పారంటే..
రాయ్‌పూర్‌కు 350 కి.మీ. దూరంలో ఉన్న ఐటీబీపీ క్యాంపులో బుధవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని.. న్యూస్ ఏజెన్సీ పీటీఐకి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఓ జవాన్ తన సర్వీస్ గన్‌తో సహచరులపై కాల్పులకు దిగాడని.. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయని ఆయన చెప్పారు. ఈ వివాదానికి కారణాలేంటో తెలియరాలేదని.. సెలవు మంజూరు చేయకపోవడంతోనే.. సదరు జవాన్ కాల్పులకు దిగాడని అనుమానిస్తున్నామని ఐజీ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.