యాప్నగరం

గుజరాత్ సీఎం, బీజేపీ చీఫ్..ఇద్దరూ వెనుకంజ!

బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ అనిపిస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యులు వెనుకబడ్డారు.

TNN 18 Dec 2017, 10:17 am
బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ అనిపిస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యులు వెనుకబడ్డారు. అటు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇటు గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వఘానీ.. ఇద్దరూ వెనుకంజలో ఉండటం విశేషం. తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతుండగా.. కమలం పార్టీ ముఖ్యనేతలిద్దరూ వెనుకపడ్డారు.
Samayam Telugu chief minister vijay rupani trails behind congress in rajkot west
గుజరాత్ సీఎం, బీజేపీ చీఫ్..ఇద్దరూ వెనుకంజ!


రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. మోడీ తర్వాత గుజరాత్ సీఎంలుగా నియమితం అయిన వాళ్లలో ఎన్నికలను ఎదుర్కొంటున్న తొలి సీఎంగా ఉన్న ఈయన ఫస్ట్ రౌండ్ లో నే ప్రత్యర్థికి మంచి మెజారిటీని అప్పగించాడు. కాంగ్రెస్ తరఫు నుంచి ఈ నియోజకవర్గంలో రాజ్యగురు అనే నేత పోటీ చేశాడు. ఆయన ఫస్ట్ రౌండ్లో 1258 ఓట్లను సాధించగా.. రూపానీ కేవలం 491 ఓట్లకే పరిమితం అయ్యాడు.

రూపానీ విజయం పట్ల మొదటి నుంచి అనుమానాలు ఉండటం విశేషం. ఈయన ఓడిపోవచ్చు అనే మాట ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అప్పటి నుంచి వినిపిస్తోంది. అయితే ఇవీ అర్లీ ట్రెండ్స్ మాత్రమే. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే సరికి ఫలితం ఎటైనా మొగ్గవచ్చు.

ఇక భావ్ నగర్ వెస్ట్ నుంచి పోటీ చేసిన బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రెసిడెంట్ జితూ వఘానీ కూడా తొలి తొలి రౌండ్స్ లో వెనుకబడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.