యాప్నగరం

బ్రహ్మపుత్రలో జల విలయం.. చైనా హెచ్చరిక

బ్రహ్మపుత్రకు భారీ వరద సూచన. చైనా హెచ్చరికలు.. అరుణాచల్‌లో హై అలర్ట్.

Samayam Telugu 31 Oct 2018, 8:53 pm
బ్రహ్మపుత్ర నదికి భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు చైనా మరోసారి హెచ్చరించింది. అరుణాచల్‌ ప్రదేశ్ సమీపంలో బ్రహ్మపుత్రలో ఓ చోట కొండ చరియలు విరిగిపడ్డాయని, ఈ కారణంగా నదీ ప్రవాహానికి అడ్డంగి ఏర్పడిందని సోమవారం (అక్టోబర్ 29) రాత్రి భారత్‌ను చైనా హెచ్చరించింది. కొండ చరియలు విరిగిపడటం వల్ల నదిలో కృత్రిమ సరస్సు జలాశయం ఏర్పడిందని, ప్రవాహం పెరిగితే అది ఒక్కసారిగా కొట్టుకుపోయి వరద బీభత్సం జరిగే ప్రమాదం ఉందని చైనా అధికారులు తెలిపారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో బుధవారం మరోసారి హెచ్చరికలు పంపారు.
Samayam Telugu brahmaputra


అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో టిబెట్‌లోని జైలా గ్రామంలో ఈ ప్రమాద పరిస్థితి నెలకొని ఉందని చైనా తెలిపింది. బుధవారం ఉదయం 6.30 గంటల వరకు అక్కడ ఏర్పడిన కృత్రిమ సరస్సులో సుమారుగా 337 ఎంసీఐ నీటి నిల్వ ఉన్నట్లు అంచనా వేసింది. అక్కడ వరద ప్రవాహం పెరిగితే బ్రహ్మపుత్ర నది తీరం వెంట ఒక్కసారిగా వరదలు విరుచుకుపడే ప్రమాదం ఉంది.

చైనా హెచ్చరికల నేపథ్యంలో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో హై అలర్డ్ విధించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు..

చైనా ఎందుకు హెచ్చరించింది?
బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులకు సంబంధించిన వివరాలను చైనా ఈ ఏడాది మే నుంచి భారత్‌కు అందిస్తోంది. నదీ జలాలకు సంబంధించి ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చైనా ఈ వివరాలను భారత్‌తో పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వివరాలను మే 15 నుంచి, సట్లెజ్ నది వివరానలు జూన్ 1 నుంచి అందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.