యాప్నగరం

భారత్, చైనా మధ్య బుల్లెట్ రైలు.. వయా బంగ్లాదేశ్, మయన్మార్!

మన దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కోల్‌కతా, దక్షిణ చైనాలోని కన్మింగ్ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్ట నిర్మిద్దామని చైనా ప్రతిపాదించింది.

Samayam Telugu 13 Sep 2018, 10:56 am
చైనా, భారత్ మధ్య బుల్లెట్ రైలు నడిస్తే..? ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? చైనాలోని కన్మింగ్, మనదేశంలోని కోల్‌కతా నగరాల మధ్య బుల్లెట్ సర్వీసుల్ని తీసుకొచ్చేందుకు చైనా కాన్సుల్ జనరల్ మా ఝాన్వు ప్రతిపాదించారు. దక్షిణ చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లో ఉన్న కన్మింగ్ నగరానికి ట్రాన్స్‌పోర్టేషన్ హబ్‌గా పేరుంది. 2000 కి.మీ. పొడవైన ఈ మార్గాన్ని మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా నిర్మించేలా ప్రతిపాదిస్తున్నారు. ఇరు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా.. బుల్లెట్ ట్రైన్ ద్వారా రెండు గంటల్లోనే చేరుకోవచ్చు.
Samayam Telugu kunming kolkata


వచ్చే పదేళ్లలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే.. ఢాకా, మయన్మార్ మీదుగా కోల్‌కతా, కన్మింగ్ నగరాల మధ్య రెండు గంటల్లోనే ప్రయాణించొచ్చని మా ఝాన్వు తెలిపారు.

ఈ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ (బీసీఐఎం) కారిడార్లో వాణిజ్యానికి ఊతం లభిస్తుందని మా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నాలుగు దేశాలకు ప్రయోజనం లభిస్తుందని, ఉమ్మడిగా అభివృద్ధి చెందుతాయని మా చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.