యాప్నగరం

చైనాకు కీలెరిగి వాత పెట్టిన భారత్..

మానవ హక్కుల సంఘం కార్యకర్త డోల్కన్ ఇసాకు భారతదేశం వీసా మంజూరు చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది

Hindustan Times 22 Apr 2016, 10:25 pm
ప్రపంచ ఉయ్ఘర్ కాంగ్రెస్ అనే జర్మనీకి చెందిన ఒక మానవ హక్కుల సంఘం కార్యకర్త డోల్కన్ ఇసాకు భారతదేశం వీసా మంజూరు చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. డోల్కన్ ఇసాపై చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్రవాదిగా ముద్రవేసి పలు కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం మ్యూనిచ్ లో ఉంటున్న డోల్కన్ ఈసా మన దేశంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని నడుపుతున్న దలైలామాను కలిసేందుకు రావాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. ప్రజాస్వామ్యం గురించి ధర్మశాలలో దలైలామా నేతృత్వంలో జరిగే సమావేశం నేపథ్యంలో ఆయనను కలవాలని భావించారు. ఇందుకు భారతదేశానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోగా మనదేశం ఆయనకు వీసాను మంజూరు చేసింది. ఇప్పుడు అదే చైనా ఆగ్రహానికి కారణమైంది. జింజియాంగ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యం గురించి ఆయన స్థానికుల్లో ప్రచారం చేసేవారు. అది ఆ దేశానికి కంటగింపుగా మారింది.
Samayam Telugu china seething after india issues visa to uyghur terrorist
చైనాకు కీలెరిగి వాత పెట్టిన భారత్..


దాంతో ఆయనపై ఆ దేశ ప్రభుత్వం తీవ్రవాదిగా ముద్రవేసింది. జనాలను చంపేందుకు కుట్రపన్నాడంటూ కేసులు పెట్టింది. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాది మసూద్ అజర్ నిర్వహించే జైషే మహమ్మద్ సంస్థను తీవ్రవాద సంస్థగా ప్రకటించే విషయమై ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన యత్నాలకు ఇటీవల చైనా గండికొట్టింది. ఐక్యరాజ్యసమితిలో తనకున్న వీటో హక్కుతో దాన్ని నిలుపుదలచేయించింది. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు బుద్ధిచెప్పేందుకే ఈ విధంగా చేసి ఉంటుందని వార్తలు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.