యాప్నగరం

చిన్నమ్మే చీఫ్ మినిస్టర్ కావాలి: పార్టీ నేతలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టి రెండు రోజులు కాకముందే...చిన్నమ్మ

TNN 2 Jan 2017, 2:25 pm
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టి రెండు రోజులు కాకముందే...చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె మద్దతుగా గళం విప్పుతున్నారు. సీఎం కుర్చీలో చిన్నమ్మే కూర్చోవాలని బహిరంగంగా ‘డిమాండ్’ చేస్తున్నారు.
Samayam Telugu chinnamma must take charge as tamil nadu cm thambidurai says
చిన్నమ్మే చీఫ్ మినిస్టర్ కావాలి: పార్టీ నేతలు


లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై ‘‘అమ్మ జయలలితకు ప్రజలు, పార్టీ కార్యకర్తలపై ప్రేమ ఉన్నట్టే చిన్న శశికళకు అంతే ప్రేమ ఉంది. అమ్మ మాదిరే చిన్నమ్మ కూడా శక్తివంతమైన నేత. ఆమె వెంటనే తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నా’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.

అమ్మ ఆకస్మిక మరణంతో కోట్లాదిమంది పార్టీ కార్యకర్తలు, పార్టీ భవిష్యత్ ఏంటనీ దిగులు చెందిన సమయంలో తానున్నానని చిన్నమ్మ పార్టీ బాధ్యతలు తీసుకున్నారని తంబిదురై గుర్తు చేశారు. అమ్మ ఆశయ సాధన కేవలం చిన్నమ్మతోనే సాధ్యమని తామంతా విశ్వసిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక్ సభ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని అప్పటిలోపు పార్టీ మరింత బలోపేతం కావాలని, దానికి చిన్నమ్మే సీఎం కావాలని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అధికారంలో ఉన్న పార్టీకి రెండు పదవులు (పార్టీ అధ్యక్ష పదవి, సీఎం సీటు) ఒకే వ్యక్తి చేతిలో ఉండాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జయలలిత మరణానంతరం ఎవరు తదుపరి సీఎం అన్న డిమాండ్ వచ్చినప్పుడు తంబిదురై పేరు కూడా బలంగా వినిపించింది.

కాగా, శశికళ సీఎం కావాలనుకుంటూ తక్షణమే తప్పుకుంటానని సీఎం ఓ పన్నీరుసెల్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.