యాప్నగరం

చిత్రకూట్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

TNN 12 Nov 2017, 2:41 pm
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన నీలాన్షు చతుర్వేది 14 వేల ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన దయాల్ త్రిపాఠిపై గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ (65) మరణించడంతో ఉప ఎన్నికను నిర్వహించాల్సి వచ్చింది. నవంబర్ 9న ఓటింగ్ నిర్వహించగా, ఆదివారం ఉదయం 8 గంటలకు పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది.
Samayam Telugu chitrakoot bypoll congress beats bjp by over 14000 votes
చిత్రకూట్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం


ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే చిత్రకూట్ నుంచి ప్రేమ్ సింగ్ 1998, 2003, 2013 ఎన్నికల్లో గెలుపొందారు. 2008లో బీజేపీ అభ్యర్థి సురేంద్ర సింగ్ గహర్వార్ చేతిలో ఓడిపోయారు. ప్రేమ్ సింగ్ మరణంతో.. ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అధికార బీజేపీ భావించింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో 12 మంది అభ్యర్థులు పోటీ పడగా, 65 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.