యాప్నగరం

Bengal: చేపలు అమ్మే వ్యక్తి ఇంట్లో డబ్బు కట్టలు... ఏకంగా రూ.1.4 కోట్లు

పశ్చిమ బెంగాల్లో (Bengal) చేపలు వ్యాపారి ఇంటిపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులకు కళ్లు చెదిరే డబ్బు కనిపించింది. కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అతని దగ్గరకు అంత డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ స్మంగ్లిగ్ ద్వారా ఇంత డబ్బు వచ్చిందా..? అని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఇటీవల టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో భాగంగా ఈడీ తనిఖీలు నిర్వహించింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 Sep 2022, 6:54 pm
పశ్చిమ బెంగాల్ (Bengal) మాల్డాలోని గజోల్ ప్రాంతంలో సీఐడీ అధికారులు ఓ చేపల వ్యాపారి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో రూ.1.4 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత డబ్బును ఆయన ఎలా సంపాదించాడనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu Bengal CID seizes


పక్కా సమాచారం మేరకు అధికారులు చేపల వ్యాపారి జయప్రకాశ్ సాహా నివాసంలో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అతని దగ్గర అంత డబ్బు ఉండడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉండే ప్రాంతం భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున సాహా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాల్గొన్నాడా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.


ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బును అధికారులు లెక్కించారు. మొత్తం రూ.1,39,03,000లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నగదు ఉంచినట్టు తమకు సమాచారం అందిందని సీఐడీ స్పెషల్ సూపరింటెండెంట్ వెల్లడించారు. కాగా ఇంటీవలె ఈడీ అధికారులు టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో భాగంగా పలువురి ప్రముఖుల ఇళ్లలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు కట్టలు బయటపడ్డాయి. దీనిపై విచారణ చేయగా.. ఆ డబ్బంతా మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సంబంధించినవని ఆమె చెప్పింది. దాంతో అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సంచలనం అయింది. మరికొన్ని స్కామ్‌ల విషయంలో కూడా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also:తొలిరాత్రే వధువుకు నరకం.. నెత్తుటి మరకలు కనిపించలేదని దారుణ శిక్ష

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.