యాప్నగరం

ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. బీజేపీకి సీఎం కేజ్రీవాల్ చెక్

ఢిల్లీ మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్ ప్రతిపాదించిన పథకం బీజేపీని ఇరకాటంలో పడేసేలా ఉందతి.

Samayam Telugu 3 Jun 2019, 3:49 pm
హిళల కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించేలా ప్రతిపాదనలు చేసింది. త్వరలో మెట్రో రైళ్లతో పాటు డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం కేజ్రీవాల్ సోమవారం (జూన్ 3) ప్రకటించారు. ప్రయాణాల్లో మహిళలకు భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తీసుచొచ్చినట్లు తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పార్టీ ఏడింటికి ఏడు స్థానాల్లోనూ పరాజయం పాలైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ప్రకటించిన ఈ పథకం చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu delhi
ఢిల్లీ మెట్రో


మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై ఏడాదికి రూ. 700 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 50 శాతం చొప్పున వాటా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. ఢిల్లీ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. కేజ్రీవాల్ సర్కార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ఉంది.

ఢిల్లీలో మహిళలకు ఉచిత రవాణా కల్పించే పథకానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే.. సదరు టికెట్ల విక్రయాల ద్వారా రావాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగైతే.. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోస్తూ పథకం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఆప్ పార్టీ ప్రయత్నించొచ్చు. ఒకవేళ కేంద్రం కూడా పథకానికి అంగీకరిస్తే.. రూ.700 కోట్లు ఆదా అవడమే కాకుండా.. ఆ పథకం తమ ఘనతగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కేజ్రీవాల్‌కు ఉంది.


కేజ్రీవాల్ ప్రతిపాదించిన ఈ ప్రతిష్టాత్మక పథకంపై అధికారుల నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. ‘ప్రయాణాల్లో మహిళలకు భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చాం. అయితే.. టికెట్లు కొనుక్కునే స్తోమత ఉన్న మహిళలు కొనుక్కోవచ్చు. వారు ఈ సబ్సీడీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ఎలా అమలు చేయాలో తెలిపేందుకు డీటీసీ, మెట్రో అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చాం. రెండు, మూడు నెలల్లో దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనిపై ప్రజల నుంచి సలహాలు కూడా కోరుతున్నాం’ అని సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.