యాప్నగరం

ఇక ఇంటిపన్ను లేకుండా చేస్తానంటున్న కేజ్రీవాల్

ఢిల్లీలో జరగనున్న సివిక్ పోల్స్ అక్కడి రాజకీయ పార్టీలకి పెను సవాల్‌గా మారాయి. దేశ రాజధానికి మేయర్ పీఠం కావడం

TNN 26 Mar 2017, 10:01 am
Samayam Telugu cm arvind kejriwal promises to scrap house tax if he win civic polls
ఇక ఇంటిపన్ను లేకుండా చేస్తానంటున్న కేజ్రీవాల్
వచ్చే నెల 23న ఢిల్లీలో జరగనున్న సివిక్ పోల్స్ అక్కడి రాజకీయ పార్టీలకి పెను సవాల్‌గా మారాయి. దేశ రాజధానికి మేయర్ పీఠం కావడం అందుకు ఓ కారణం అయితే, ప్రస్తుతం అక్కడ అధికారంలో వుంది ఆమ్ ఆద్మీ పార్టీ కావడం మరో మరో కారణం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీని అన్ని విధాల తమ పార్టీనే పాలించేలా చూసుకోవాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... తమ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే, ఢిల్లీలో ఇంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తానని ప్రకటించారు. గెలిచిన వెంటనే పాత బకాయిలని కూడా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు కేజ్రీవాల్. అయితే, వాణిజ్య సముదాయాలు, వాణిజ్య భవనాలకి వసూలు చేసే పన్ను యధావిధిగా వుంటుందని తెలిపారు కేజ్రీవాల్.

ఇదిలావుంటే, అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేజ్రీవాల్ ఇలాంటి హామీలు ఇవ్వడం సిగ్గుచేటు అని బీజేపీ విమర్శించగా... అమలుకు సాధ్యం కాని పెద్ద హామీలని ఇవ్వడంలో ఆప్ ముందుంటుంది అని కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీలో ప్రస్తుతం 10.3 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు వున్నారు. ఈ మార్చి31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రాపర్టీ టాక్స్ రూపంలో ఢిల్లీ ప్రభుత్వం రూ.1,330 కోట్లు వసూలు చేసింది. పన్ను చెల్లించాల్సి వున్న వారిలో దాదాపు ఓ 30% మంది మాత్రమే క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నారు. అధికశాతం జనాభా పన్ను ఎగవేయడమే ప్రస్తుతం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తాము అన్నివిధాల అధ్యయనం చేసిన తర్వాతే ఈ హామీ ఇస్తున్నాం అని అంటున్నారు. మరి కేజ్రీవాల్ ఇచ్చిన ఈ హామీ ఢిల్లీ సివిక్ పోల్స్‌లో ఏమేరకు ప్రభావం చూపనుందో వేచిచూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.