యాప్నగరం

మహిళలకు నిరసనలు ఫ్యాషనైపోయాయి.. సీఎం ఘాటు వ్యాఖ్యలు!

మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం మహిళలకు, పిల్లలకు ఫ్యాషన్‌లా మారిందని ఆయన మండిపడ్డారు..

TNN 7 Jul 2017, 5:51 pm
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిరసనలకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం మహిళలకు, పిల్లలకు ఫ్యాషన్‌లా మారిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కె.ఆర్. రామస్వామి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ సీఎం ఇలా స్పందించారు. స్త్రీలు, పిల్లల పట్ల పోలీసులు సహజంగానే కొంచెం ఉదారంగా వ్యవహరిస్తారని, దీన్ని ఆసరాగా చేసుకొని నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
Samayam Telugu cm palaniswami says anti liquor protest by women and children becomes fashion
మహిళలకు నిరసనలు ఫ్యాషనైపోయాయి.. సీఎం ఘాటు వ్యాఖ్యలు!


ఆ రాష్ట్రంలోని తిర్పూర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళపై పోలీసు అధికారి చేయి చేసుకోవడం పట్ల దుమారం రేగుతోంది. ‘ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నేను ఇంతకుముందే వివరంగా చెప్పాను. మహిళలు, పిల్లలను నిరసన కార్యక్రమాల్లో భాగం చేయడం ఆందోళనకారులకు ఓ ఫ్యాషన్‌లా మారింది. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతున్నారు’ అని పళనిస్వామి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.