యాప్నగరం

బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనకాల సీఎం ప్రసంగం

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ (బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్) వెనకాల నిల్చుని ప్రసంగించడం పలు విమర్శలకు

Samayam Telugu 18 Jun 2017, 12:35 pm
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ (బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్) వెనకాల నిల్చుని ప్రసంగించడం పలు విమర్శలకు తావిస్తోంది. యోగి తొలిసారిగా గురువారం బిహార్ లో పర్యటించారు. యోగి పర్యటన సందర్భంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ పలు విమర్శలు చేశారు. యోగి బిహార్ లో కాలు మోపే ముందు తమ రాష్ట్రంలోలాగా మద్యపాన నిషేదం, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu cm yogi delivers speech behind bullet proof enclosure
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనకాల సీఎం ప్రసంగం


దీంతో యోగి పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యోగి ప్రసంగించే సమయంలో పోడియం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో అధికారులు, పోలీసులు వివరించలేదు. యోగి పర్యటించిన దర్భాంగ జిల్లాలో నితీష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సైతం చేశారు.

యోగి నితీష్ కుమార్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దమ్ముంటే బిహార్ లో అక్రమ గోవధ కేంద్రాలను మూసివేయాలని సవాల్ చేశారు. ట్రిపుల్ తలాక్ పై నితీష్ ప్రభుత్వం వైఖరేంటనీ ప్రశ్నించారు. తాను తొలిసారిగా బిహార్ పర్యటిస్తున్నానని చెప్పిన యోగి ఇకపై ప్రతిజిల్లానూ సందర్శిస్తానని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.