యాప్నగరం

EPS పై OPS తిరుగుబాటుకు రెడీ..?

తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయా? ఇటీవలే రాజీ అయిన

TNN 16 Oct 2017, 9:58 am
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయా? ఇటీవలే రాజీ అయిన ఎడపాటి పళనిస్వామి, పన్నీరు సెల్వంలు మళ్లీ కత్తులు దూయనున్నారా? ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉణ్న పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి మీద తిరుగుబాటు చేయనున్నాడా? ఇందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే.. ఔను అంటున్నాయి తమిళ రాజకీయాలను పరిశీలిస్తున్న వర్గాలు. పళనిస్వామి తీరు పన్నీరుకు నచ్చడం లేదని, కేంద్రం నుంచి తనకు మద్దతు ఉందని భావిస్తున్న పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.
Samayam Telugu cold war erupts between eps and ops
EPS పై OPS తిరుగుబాటుకు రెడీ..?


పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి పళనిని సీఎంగా చేసింది శశికళ. ఆ సమయంలో మొదట సమ్మతంగానే రాజీనామా చేసిన పన్నీరు ఆ తర్వాత తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని వెళ్లాడు. అయితే అనంతర పరిణామాల్లో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పన్నీరుతో రాజీ అయ్యాడు పళని స్వామి. దీనికి ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్ ఉందంటారు. ఈపీఎస్, ఓపీఎస్ లు చేతులు కలిపిన అనంతరం.. ఈపీఎస్ ముఖ్యమంత్రి, ఓపీఎస్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

కానీ వీరి మధ్యన సయోధ్య అంతంత మాత్రమే అని తెలుస్తోంది. పన్నీరు ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పటి నుంచి పళనిలో అభద్రతాభావం పెరిగిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పళనిని దించి, పన్నీరు ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడని అంటున్నారు. పన్నీరు మళ్లీ మెరీనాబీచ్ లోని జయలలిత సమాధిని చేరుకోవచ్చని.. అక్కడ నుంచి తిరుగుబాటును ప్రకటించవచ్చనే తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

అందుకే పన్నీరుపై పళనిస్వామి నిఘా ఉంచాడట. అయితే తిరుగుబాటు మాత్రం ఖాయమనే అంటున్నారు. కేంద్రం తనను కాచుకుంటుందనే ధీమాతో పన్నీరు తిరుగుబాటు వ్యూహాన్ని రచిస్తున్నాడట. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగినట్టే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.