యాప్నగరం

సోను నిగమ్‌పై కేసు నమోదు

మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలకు లౌడ్‌స్పీకర్లు వాడటంపై వివాదాస్పద ట్వీట్లు చేసిన ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

TNN 20 Apr 2017, 4:39 pm
మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలకు లౌడ్‌స్పీకర్లు వాడటంపై వివాదాస్పద ట్వీట్లు చేసిన ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు రాతపూర్వక ఫిర్యాదు అందడంతో సోనుపై కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసులు వెల్లడించారు.
Samayam Telugu complaint filed against sonu nigam over loudspeakers tweet
సోను నిగమ్‌పై కేసు నమోదు


స్థానికంగా ఓ మత సంస్థను నడిపిస్తున్న నదీమ్ రానా అనే వ్యక్తి జిన్సీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, సోనుపై రాత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు ఔరంగాబాద్ పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్ వివరించారు. ప్రస్తుతానికి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని కమీషనర్ చెప్పారు.

కాగా, సోను వివాదాస్పద ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోల్‌కతాకు చెందిన ఓ ముస్లిం మత పెద్ద ఆయనపై ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. సోనుకి ఎవరైతే గుండు కొట్టించి, అతని మెడలో చెప్పుల దండ వేస్తే రూ. 10 లక్షల నజరానా ఇస్తానని ఆ మతపెద్ద ప్రకటించారు. దీనిపై సోనూ కూడా తనదైన శైలిలో స్పందించారు.

తాను గుండు కొట్టించకుంటాను రూ. 10 లక్షలతో సిద్ధంగా ఉండమని ఆ మతపెద్దకు సోను సవాల్ విసిరారు. అన్నట్టుగానే బుధవారం తన ఇంటికి మీడియాను పిలిచిన సోను.. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్‌తో గుండు కొట్టించుకున్నారు. అయితే సోను ప్రవర్తనపై ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయనపై కేసు కూడా నమోదయింది. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.