యాప్నగరం

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు

15ఏళ్ల శివరాజ్ సింగ్ సర్కారుకు చెక్ పెట్టే అవకాశం రావడంతో హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Samayam Telugu 11 Dec 2018, 7:07 pm
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు వచ్చే పరిస్థితి నెలకొంది. తొలి నుంచి రెండు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతూ వస్తోంది. దీంతో అధికారం ఎవరు చేపడుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. సాయంత్రం 6.30 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో గెలిచి మరో 58 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 41 చోట్లు గెలుపొంది.. 70 చోట్ల ఆధిక్యంలో ఉంది.
Samayam Telugu congressparty


15ఏళ్ల శివరాజ్ సింగ్ సర్కారుకు చెక్ పెట్టే అవకాశం రావడంతో హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఎస్పీతో పాటు ఇతర పార్టీలను సంప్రదిస్తోంది. కనీస మెజార్టీ రాకపోతే వారి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింథియా.. ఇతర పార్టీలను సంప్రదిస్తున్నారు. చేతికందివచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని భావిస్తో్ంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.