యాప్నగరం

ఆరెస్సెస్ నేతకు ముస్లిం నేత మద్దతు!

రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఆ పదవిలో ఆయన్ను కూర్చోబెట్టడమే

Samayam Telugu 1 Apr 2017, 3:56 pm
రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఆ పదవిలో ఆయన్ను కూర్చోబెట్టడమే కరెక్ట్ అనే డిమాండ్ పెరుగుతోంది. మోహన్ భగత్ రాష్ట్రపతి కావాలని శివసేన ఎంపీ వ్యాఖ్యానిస్తే.. తాజా కర్ణాటకకు చెందిన ముస్లిం నేత ఒకరు నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకే లేఖ రాశారు.
Samayam Telugu congress leader ck jaffer shareef backs mohan bhagwat as next president of india
ఆరెస్సెస్ నేతకు ముస్లిం నేత మద్దతు!


మోహన్ భగవత్ ను రాష్ట్రపతి చేయాలంటూ కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీకే జాఫర్ షరీప్ ప్రధానికి లేఖ రాశారు. మోహన్ భగవత్ దేశభక్తుడు అంటూ షరీప్ పొగడ్తలు గుప్పించారు. రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో భగవత్ సరియైన నాయకుడు అంటూ చెప్పుకొచ్చారు.

బంగ్లాదేశ్ తో యుద్ధం తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఆరెస్సెస్ నేతలు మద్దతు ప్రకటించారని... ఇప్పుడు తాను ముస్లిం అయినా హిందూ నేతకు మద్దతు ఇస్తున్నది కేవలం జాతీయ ప్రయోజనాల దృష్టిలోనేనని.. ఇందులో కుంచిత స్వభావం వద్దని షరీఫ్ హితవు పలికారు.

ఇటీవల కర్ణాటకు చెందిన మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ముస్లిం కాంగ్రెస్ నేత ఆరెస్సెస్ కు మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. అయితే షరీప్ అభిప్రాయం వ్యక్తిగతమైందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మోహన్ భగవత్ ను రాష్ట్రపతి చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి రేసులో తాను లేనని మోహన్ భగవత్ రావత్ వ్యాఖ్యలకు సమాధానంగా చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.