యాప్నగరం

‘గాంధీని చంపిన గాడ్సేకి, మోదీకి తేడా లేదు.. ఇద్దరిదీ ఒకటే సిద్ధాంతం’

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.

Samayam Telugu 30 Jan 2020, 3:36 pm
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాయనాడ్‌లోని నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా మోదీపై విమర్శలు గుప్పించారు. గాంధీని హత్యచేసి నాథూరాం గాడ్సే, మోదీలది ఒకే సిద్ధాంతమని ఆయన దుయ్యబట్టారు. ఇద్దరూ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని రాహుల్ విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంతో దేశంలోని పౌరులు తాము భారతీయులమేనని నిరూపించుకునే పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. తన నియోజకవర్గం వాయనాడ్‌లోని కాల్‌పట్టేలో సీఏఏకి వ్యతిరేకంగా ‘రాజ్యాంగం పరిరక్షణ’పేరుతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. మోదీ, గాడ్సేలకు ఏమీ తేడాలేదని ధ్వజమెత్తారు.
Samayam Telugu rahul


‘ప్రస్తుతం గాంధీ భావజాలాన్ని సవాల్ చేయడానికి ఒక అజ్ఞాని ప్రయత్నిస్తూ.. ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు... గాడ్సే, నరేంద్ర మోదీలది ఒకటే భావజాలం.. ఇద్దరూ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు.. వారికి ఎలాంటి వ్యత్యాసం లేదు.. తాను గాడ్సే సిద్ధాంతాలను నమ్ముతానని చెప్పే ధైర్యం మోదీకి లేదు’అని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.

‘దేశంలోని పౌరులు తాము భారతీయులమని నిరూపించుకునే పరిస్థితి దాపురించిందని, భారతీయుడు ఎవరు? అని నిర్ణయించడానికి నరేంద్ర మోదీ ఎవరు? భారతీయతను ప్రశ్నించడానికి మోదీకి ఎవరు అధికారం ఇచ్చారు? నాకు తెలుసు తాను భారతీయుడ్ని అని, దీని గురించి ఎవరి ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఇలాగే దేశంలోని 1.4 బిలియన్ల మంది పౌరులు సైతం తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని రాహుల్ విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.